స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం జయంతి, మైనార్టీల సంక్షేమదినోత్సవం కాకినాడ కలెక్టరేట్ లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలిముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆజాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.