కాకినాడ 37వ డివిజన్ కచేరి పేట లో గల యుటిఎఫ్ టీచర్స్ రూమ్ ప్రక్కన భారీగా ఏర్పాటుచేసిన బ్రాందీ షాపును తొలగించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా నగర అధ్యక్షురాలు జి భూలక్ష్మి మాట్లాడుతూ కచేరేపేట నుండి అనేకమంది మహిళలు వివిధ ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుందని, తక్షణమే బ్రాందీ షాపు తొలగించాలని కోరారు.