ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డివిజన్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ షరీఫ్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఎల్ఐసి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.