స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నిత్యస్మరణీయులని ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్. శ్రీ నగేష్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అసమాన ప్రజ్ఞపాటలతో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మహోన్నత వ్యక్తి తిలక్ అని కొనియాడారు.