రమణయ్యపేటలో లెనిన్ వర్ధంతి వేడుకలు
కమ్యూనిస్టు విప్లవ నేత లెనిన్ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 24 గంటలు విప్లవ చర్యకై తపించిన విప్లవకారుడు లెనిన్ అని, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో లెనిన్ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజం కు లెనిన్ సూచించిన మార్పులతో లెనినిజం సిద్ధాంతంగా రూపొందిందని అన్నారు.