ఘనంగా డివిఆర్ స్కూల్ వార్షికోత్సవం - ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు

563చూసినవారు
ఘనంగా డివిఆర్ స్కూల్ వార్షికోత్సవం - ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు
కొత్తపేట మండలం కొత్తపేటలోని డివిఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ డి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు. తాము స్కూల్లో అత్యుత్తమంగా పాఠాలు చెప్పినా. తల్లిదండ్రులు ఇంటిదగ్గర శ్రద్ధ తీసుకుని చదివిస్తే విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారన్నారు. అటు టీవీలు, సెల్ ఫోన్ లకు విద్యార్థులను దూరంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్