కొత్తపేట: మెరిట్ ఆధారంగా రేషన్ షాపులు కేటాయించాలి

74చూసినవారు
కొత్తపేట: మెరిట్ ఆధారంగా రేషన్ షాపులు కేటాయించాలి
కొత్తపేట డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన షాపులు కేటాయించాలని పలువురు అభ్యర్థులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనెల 19న జరిగిన రాత పరీక్షలో 75 మంది ఎంపికైన విషయం తెలిసిందే. వారికి 22 , 23 తేదీల్లో మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. మౌఖిక పరీక్షలో రాజకీయ జోక్యం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్