ఐదేళ్ల పాలనలో సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని సీఎం చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభలో శుక్రవారం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారన్నారు. తమ హయాంలో 8, 97, 000 పంట గుంటలు తవ్వామని, గత ఐదేళ్లలో ఏ ఒక్కటి తవ్వలేదన్నారు. 3, 60, 000 ఎకరాల హార్టికల్చర్ పనులు ఇచ్చామని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా లేదని విమర్శలు చేశారు.