ఆలమూరు గ్రామంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామివారి ఆలయం వద్ద సోమవారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానముల దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ మాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి ప్రసంగ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పునీతులవుతున్న తీర్థానందాచార్యులు అదృష్టవంతులని అన్నారు.