సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని కొత్తపేటలో నిర్వహించే ప్రభల తీర్థం ఉత్సవాలపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సంక్రాంతి రోజున కొత్తపేటలో ప్రభల ఉత్సవం భారీగా జరగనుంది. ఈ ఉత్సవాలలో తీర్థంతోపాటు భారీగా బాణాసంచా కాల్పులు జరగనున్నాయి. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వీక్షకులు కొత్తపేటకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో తీర్థంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా ఈ నిఘాను ఏర్పాటు చేశారు.