చాగల్లు మండలం పంగిడి బుధవారం రాత్రి పెట్రోల్ బంక్ సమీపంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం సూరిబాబు (49) అనే లారీ డ్రైవర్ చీరాల నుంచి పంగిడి వచ్చారు. పంగిడి ఇసుక ఫ్యాక్టరీ వద్ద లోడ్ చేసే క్రమంలో ఆలస్యమైంది. దీంతో భోజనానికి క్లీనర్‌తో కలిసి బయటికి వెళ్లారు. అనంతరం భోజనం చేసి వస్తుండగా డ్రైవర్ గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పుకూలాడు. పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.