కొవ్వూరు:  27న కరెంటు బిల్లుల పెంపుపై పోరుబాట

79చూసినవారు
కొవ్వూరు వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 27న కరెంట్ ఛార్జీల పెంపుపై పోరుబాట నిరసన కార్యక్రమం జరుగుతుందని కొవ్వూరు నియోజకవర్గం ఇన్ చార్జ్ తలారి వెంకట్రావు అన్నారు. మంగళవారం చాగల్లులోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరుబాట నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలన్నారు.

సంబంధిత పోస్ట్