కార్తీకమాసంలో శైవక్షేత్రల యాత్ర స్పెషల్ బస్సులను దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు విశేషంగా వినియోగించుకోవడం సంతోషదాయకమని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ అన్నారు. ఖమ్మం నుండి వచ్చిన యాత్రికుల కొరకు శుక్రవారం కొవ్వూరు ఆర్టీసీ డిపో నుండి ఏకాదశరుద్రుల యాత్ర స్పెషల్ బస్సును ఏర్పాటు చేశారు. బస్సుకిబస్సుకు సరిపడా ప్రయాణికులు ఉన్నట్లయితే వారి కోరిన ప్రాంతం నుండి బస్సు ఏర్పాటు చేస్తామన్నారు.