చాగల్లు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా ఈఓ రవికుమార్ కార్మికులచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న "స్వచ్ఛత హి సేవా" కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేస్తూ వారంలో రెండు గంటలు, సంవత్సరంలో 100 గంటలు శ్రమదానం చేయడమే కాకుండా ప్రజల చేత కూడా చేయిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.