మండపేట: దళితులను దాడి చేసిన వారిపై కేసుల నమోదు చేయాలి

56చూసినవారు
మండపేటలో దళిత యువకులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని కుల వివక్ష పోరాట సమితి జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసిరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు అమలాపురంలో శుక్రవారం ప్రజాసంఘాల కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. మండపేటలోని ఓ థియేటర్ వద్ద జరిగిన ఘర్షణలో దళిత యువకులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్