ఎమ్మెల్యే పుట్టినరోజున అభిమానుల సందడి

79చూసినవారు
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు మండపేట టిడిపి కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం మయూరి వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం చేశారు. నియోజకవర్గ పలు గ్రామాల్లో అభిమానులు కేక్ కట్ చేశారు. వేగుళ్ల మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుని ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్