నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని మండపేట రూరల్ సీఐ పి. దొరరాజు సూచించారు. మండపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లమీదకి రావడం, విచక్షణారహితంగా వాహనాలను నడపడం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 31 రాత్రి తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని తల్లితండ్రులు తెలుసుకుని నిఘా పెట్టాలని ఆయన కోరారు.