బాణాసంచా విక్రేతలు ఖచ్చితంగా నిభందనలు పాటించాలని రామచంద్రపురం డిఎస్పీ బి. రామకృష్ణ పేర్కొన్నారు. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాణాసంచా షాపుదారులు అధికారులు గుర్తించిన ప్రదేశాలల్లో సంబంధిత ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు పొందిన తర్వాత మాత్రమే షాప్ లను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. లైసెన్స్ లు పొందకుండా బాణాసంచాను నిల్వఉంచరాదన్నారు.