మండపేటనియోజకవర్గ ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే అన్నారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు.