రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఎమ్మెల్యేగా వేగుళ్ళ జోగేశ్వరరావు భారీ మెజారిటీతో గెలవాలని కేశవరం శ్రీ రామాలయంలో ఆయన అభిమాని కంటిపూడి శ్రీను మొక్కుకున్నారు. ఆయన కోరిక నెరవేరడంతో ఆదివారం రామాలయం వద్ద మొక్కు తీర్చుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే వేగుళ్ళ స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. కంటిపూడి శ్రీను 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు.