మండపేట మండలం గొల్లపుంత పట్టణ ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డా పి.శాంతి సుచరిత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యకేంద్రం పరిధిలోని 11 మంది గర్భిణీలకు
పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గర్భ సమయంలో తీసుకోవలసిన పౌష్టికాహారం, ఆరోగ్య నియమాలను, సూచనలను వైద్యాధికారి డా. సుచరిత వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యకేంద్ర సిబ్బంది, ఎఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.