రాష్ట్రస్థాయి పిల్లల పోటీలలో ప్రతిభ కనబరిచిన చైత్ర వర్ణిత

1085చూసినవారు
రాష్ట్రస్థాయి పిల్లల పోటీలలో ప్రతిభ కనబరిచిన చైత్ర వర్ణిత
కాకినాడ, జె.ఎన్.టి.యులో నవంబరు 25, 26 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీల్లో సృజనాత్మక వస్తువుల తయారీ సబ్ జూనియర్స్ విభాగంలో మురమళ్ల కు చెందిన 4 వ తరగతి చదువుతున్న లకవరపు చైత్ర వర్ణిత ద్వితీయ బహుమతి సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన చైత్ర వర్ణితను ఐ. పోలవరం ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్