ప్రజ్ఞా సాహితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానవవాద గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం విద్యార్థులకు పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులకు గొప్ప వరమని ప్రతి విద్యార్థి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తకాలే నిజమైన మిత్రులని, విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు.