కాట్రేనికోన పరిధిలోని ఓల్డ్ అయినాపురం కాలువ గట్టు ఆక్రమణను గ్రామ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ గురువారం అడ్డుకున్నారు. అన్న క్యాంటీన్ ఫౌండేషన్ సమీపంలో ఒక వ్యక్తి కాలవ గట్టును ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో వివాదం చోటుచేసుకుంది. స్మశానానికి వెళ్లే మార్గం ఆక్రమణలకు గురవుతుందని స్థానికులు బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు. దీనిపై సర్పంచ్ స్పందించి ఆ స్థలం ఆక్రమణకు గురికాకుండా అడ్డుకట్ట వేశారు.