ముమ్మిడివరం నియోజకవర్గంలో శనివారం నీటి సంఘాల ఎన్నికల కోలాహలం నెలకొంది. నియోజకవర్గం పరిధిలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ. పోలవరం మండలాలలో నిర్దేశిత ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అమలాపురం ఆర్డీఓ మాధవి పోలింగ్ బూత్ లను పరిశీలించారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం మూడు గంటల వరకూ జరిగింది.