వాహనం పై జగన్ ఫోటో... టిడిపి నేత ఫైర్

56చూసినవారు
అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారంలో ఎండియు వాహనం ద్వారా రేషన్ సరకులు పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి శనివారం పరిశీలించారు. వాహనంపై మాజీ సీఎం జగన్ ఫొటో ఉండడంతో డ్రైవర్‌ను నిలదీశారు. అసలు సీఎం ఎవరో తెలుసా అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆయన వెంట జిల్లా మీడియా కోఆర్డినేటర్ ఫణికుమార్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్