ప్రభుత్వం చేపట్టిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని రైతులంతా ఏకతాటిపై నిర్వహించాలన్నారు. తద్వారా ఎలుకలను నివారించవచ్చన్నారు. పెరవలి మండలం కానూరు పంచాయతీ కార్యాలయం వద్ద సామూహిక ఎలుకల నిర్మూలన మందు పంపిణీని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ భావన మధు మాట్లాడుతూ. రైతాంగానికి ఎలుకలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ఉప సర్పంచ్ నరసింహారావు, రైతులు పాల్గొన్నారు.