తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి బైక్‌పై తీసుకెళ్లి, ఆమె మేనమామ అయిన కమల్ అత్యాచారం చేశాడు. బాలిక తల్లి గల్ఫ్‌లో ఉద్యోగం చేసుకుంటుండగా, తండ్రి వేరుగా ఉంటున్నారు. ఆదార్ కార్డు మార్పుల కోసం కమల్ ఆమెను తీసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.