నిడదవోలు: సమిశ్రగూడెం వద్ద ట్రాఫిక్ జామ్

59చూసినవారు
నిడదవోలు: సమిశ్రగూడెం వద్ద ట్రాఫిక్ జామ్
నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై వంతెన వద్ద శుక్రవారం సాయంత్రం భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పైగా అదే సమయంలో పాఠశాలలను వదలడంతో బస్సులు వెళ్లే మార్గం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు, స్థానికుల సహకారంతో ట్రాఫిక్ను నియంత్రించారు.

సంబంధిత పోస్ట్