నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ వసుంధర శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో టీబీ రిపోర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషకాహారం నిమిత్తం టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. డీపీఎంవో మోషే, ఎస్. టి. ఎస్ పోతురాజు, ఆశాజ్యోతి పాల్గొన్నారు.