రాష్ట్రంలో 104 వాహన వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీ. శ్రీకాంత్, ఎం. త్రిమూర్తులు తదితర కార్యవర్గ ప్రతినిధులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను శుక్రవారం సాయంత్రం కలిసి వినతి పత్రం అందజేశారు. పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో వీ. ఇందుమతి, జీ. పాపారావు, తదితరులు పాల్గొన్నారు.