మరుగుదొడ్ల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కు వినతులు

966చూసినవారు
మరుగుదొడ్ల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కు వినతులు
సామర్లకోట మున్సిపాలిటీలో కొద్ది రోజులుగా కుళాయిల ద్వారా అందించే త్రాగునీరు అత్యంత దారుణంగా ఉన్నాయని వాటిని త్రాగేందుకు వీలుపడటం లేదని పట్టణ ప్రజలు, మహిళలు మున్సిపల్ కమీషనరు బీఆర్ శేషాద్రికి, మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావుకు విన్నవించుకున్నారు. ఇంకా వేసవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే త్రాగునీరు నాచుతో కూడి రంగుమారి వస్తున్నందున ఈ సమస్యను పరిష్కరించి రక్షిత మంచినీటిని అందించాలని మహిళలు కమీషనరును కోరుతూ వినతిని అందజేస్తారు. అలాగే స్థానిక చిన్నవీది కొత్త దొడ్డి ప్రాంతంలో పబ్లిక్ మరుగుదొడ్లు ఉన్నా వాటిని ఉపయోగించకుండా బహిరంగ మల విసర్జన చేస్తున్నందున ఆ ప్రాంతాల్లో నివశించే ప్రజలమైన తాము దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నట్టు ఆ ప్రాంతానికి చెందిన మహిళలు కమీషనరుకు ఫిర్యాదు చేసారు.

సుమారు 40 మంది మహిళలు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఈ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలను అందించారు. దానితో కమీషనరు శేషాద్రి, డిఇ రామారావులు మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ చెరువులో నీటి నిల్వలు అతి తక్కువగా ఉన్నందున త్రాగునీరు పసుపుపచ్చ రంగులో వస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 25న గోదావరి జలాలు వదులుతున్నందున వాటితో చెరువును పూర్తిస్థాయిలో నింపి పరిశుభ్రమైన త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఒకవేళ అవసరం అనుకుంటే మోటార్ల ద్వారా త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అలాగే బహిరంగ మలవిసర్జన విషయంలో తాము వెంటనే చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కమీషనరు వెంట శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్‌లు ఉండి భహిరంగ మరుగుదొడ్లగా ఉపయోగిస్తున్న స్థలాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్