కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో సంక్రాంతి కోడిపందేల ఏర్పాట్లపై ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ తెలిపారు. ఆదివారం సామర్లకోట మండల పరిధిలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా ప్రాంతాల్లో నేతలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.