ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

83చూసినవారు
ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య భద్రత కోసం జలజీవన్ మిషన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మర్లావ గ్రామంలో జలజీవన్ మిషన్ పథకానికి ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి గురువారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు.

సంబంధిత పోస్ట్