పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో పెయింటింగ్ వర్క్ చేస్తుండగా బిల్డింగ్ పై నుండి ప్రమాదవశాత్తు క్రిందకు ఇద్దరు యువకులు జారీపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్ధానికులు బాధితులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా వైద్యం మధ్యలోనే ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. న్యాయం చేయాలంటూ ప్రమాదం జరిగిన బిల్డింగ్ వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.