ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

571చూసినవారు
పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు పట్టణంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను అంబేద్కర్ యూత్ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగప్ప చెరువుగట్టు మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్