పిఠాపురం: అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్..

76చూసినవారు
పిఠాపురం: అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్..
పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగలపూడి అనితపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలకు ఆమె బాధ్యత తీసుకోవాలని కోరారు. క్రిమినల్‌కు కులం, మతం ఉండదని, అరెస్టుల విషయంలో కులం అడ్డుపడిందా.? అని ప్రశ్నించారు. అధికారులు అలసత్వం వహిస్తే అవసరమైతే తానే హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటానని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ కీలకమైనది. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్