సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో గురువారం పిఠాపురంలో ఇళ్లు లేని పేదలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నేత శీలం అప్పలరాజు మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో ఇళ్లులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదన్నారు. తక్షణం స్థలాలు చూపించి, ప్రభుత్వమే వారికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి. లోవకుమారి, బి. రాజేష్, కనకరాజు, నాగమణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.