ఏలేశ్వరం మండలం యర్రవరం సీపీఎఫ్ కంపెనీ సమీపంలో శుక్రవారం డివైడర్ ను ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేసి తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తుండగా ఆటో బోల్తా పడడంతో ప్రయాణిస్తున్న పెద్దనాపల్లి గ్రామానికి చెందిన ఆరుగురి మహిళలకు తీవ్ర గాయాలవడంతో వీరిని 108 వాహనంలో ప్రత్తిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఘటన స్థలానికి ఏలేశ్వరం పోలీసులు చేరుకుని పరిస్థితిని సమక్షించారు.