రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజల నుంచి సమస్యలపై 144 అర్జీలు వచ్చాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి సమస్యలపై స్వీకరించిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, తదితరులు పాల్గొన్నారు.