బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని వారి ఆగడాలను కఠినంగా అణచివేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, హోం మంత్రి అనితను కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే రాజమండ్రిలో అప్పటి వైసీపీ ఎంపీ, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ స్థానంలో ఉన్న అగ్రనాయకత్వం ఈ బ్యాచ్‌లను పెంచి ప్రోత్సహించిందని ఆరోపించారు.