'సూపర్ సిక్స్' పథకాలను అమలు చేయాలి: గిడుగు రుద్రరాజు

54చూసినవారు
తూ. గో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్