కక్షతో క్రికెట్ పార్క్ ఆర్చ్ కూల్చివేశారు

1546చూసినవారు
రాజమండ్రి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కాలనీలోని క్రికెట్ పార్క్ గేటు ఆర్చ్‌ను దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు డా. టి. కే. విశ్వేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పార్కులో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్కును అసాంఘిక పనులకు ఉపయోగిస్తున్న వారిని మందలించామని.. ఈ క్రమంలో కొందరు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు కక్షగట్టి కూల్చివేసి ఉంటారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్