దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, బహిరంగ ప్రదేశాలకు వచ్చి బాణాసంచా కాల్చడం చట్టారీత్యా నేరమని కడియం సీఐ ఏ. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కడియం పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై బాణాసంచా పేలుస్తూ వీధులు వెంబడి తిరిగే వారిపై కఠినచర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎవరి ఇంటి వద్ద వారే టపాసులు కాల్చుకోవాలని హితవు పలికారు.