కడియం: బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది

564చూసినవారు
కడియం మండలం బుర్రిలంక నర్సరీ కూలి రౌతు కస్తూరి హత్య అత్యాచారం సంఘటనపై రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రూరల్ బీజేపీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్