కడియం: జేగురుపాడులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

77చూసినవారు
కడియం: జేగురుపాడులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కడియం మండలంలోని జేగురుపాడు గ్రామంలో సుమారు 40 ఏళ్ల వయసుగల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ ఏ. వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. పంట పొలాల్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్న వ్యక్తి మృతదేహం ఉందని వెల్లడించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు. మృతుని ఒంటిపై స్కై బ్లూ, నలుపు నిలువు చారలు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు.

సంబంధిత పోస్ట్