రాజమండ్రి లోని ఆవరోడ్డు ప్రాంతానికి చెందిన సుబ్బలక్ష్మి ఈనెల 10న తన బ్యాంకు ఖాతాలో నగదు తీసుకునేందుకు ఏటీఎంకి వెళ్లింది. డబ్బులు డ్రా చేయడం తెలియకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తిని తన ఖాతాలో నగదు తీసి ఇవ్వాలని అతడికి కార్డు ఇచ్చి పిన్ నంబరు చెప్పింది. ఏటీఎంలో డబ్బు రావడం లేదని ఆ వ్యక్తి కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. మర్నాడు ఆమె ఖాతాలో నుంచి రూ.1. 22 లక్షలు నగదు డ్రా కావడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.