బైక్ దొంగతనాలకు పాల్పడే నలుగురు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రాజమండ్రి సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల వివరాలు, దొంగతనం వివరాలను వివరించారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్‌కు తరలించామన్నారు.