రాజమండ్రి: గోదావరి పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు

62చూసినవారు
కార్తీక మాసం చివరి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు రాజమండ్రిలోని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ ల వద్ద భక్తులు స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలారు. కాగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్