రాజమండ్రి రూరల్: బాస్కెట్ బాల్ కోర్టు పనులు ప్రారంభం

60చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామంలోని ఎస్. ఎల్. ఎన్. పి. పి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ వద్ద బాస్కెట్ బాల్ కోర్టును నూతనంగా నిర్మించనున్నారు. ఈ పనులకు టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, తెలుగు యువత కార్యనిర్వాహణ కార్యదర్శి పెనుమర్తి‌ శివ సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్